వరంగల్ : ప్రైవేటు దంత కళాశాలల్లో యాజమాన్య కోటా బీడీఎస్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవాళ విడుదల చేసింది. రేపు ఉదయం 8 గంటల నుండి అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలు వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ప్రాధాన్యతా క్రమంలో కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ https://tspvtmedadm.tsche.in/ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.