గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ బీసీ వేల్ఫేర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు పాఠశాల సమస్యలపై పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటనలో డిప్యూటీ వార్డెన్ ఓంప్రకాశ్‌పై బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
- ప్రిన్సిపాల్ రవికుమార్‌ను బదిలీచేసే అవకాశం
- ప్రభుత్వం, అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఫైర్
మేడ్చల్, డిసెంబర్12(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ బీసీ వేల్ఫేర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు పాఠశాల సమస్యలపై పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటనలో డిప్యూటీ వార్డెన్ ఓంప్రకాశ్‌పై బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రిన్సిపాల్ రవికుమార్‌ను బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
పురుగుల అన్నం, వంటపాత్రల అపరిశుభ్రత, నీటి సమస్యతోపాటు బాత్రూమ్లకు డోర్లు లేని విషయాన్ని విద్యార్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఝాన్సీరాణి, డీఎస్వో శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్ మనూచౌదరికి నివేదించారు.
సర్కార్‌కు పట్టింపు లేదా?
గురుకుల పాఠశాలల్లో వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిరుపేద పిల్లలు చదివే గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోదా? అని ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోనే మూడు ఘనటలు చోటుచేసుకున్నాయంటే, ప్రభుత్వం ఈ పాఠశాలలపై ఏమేర దృష్టి సారిస్తుందనేది అర్థమవుతున్నదని ధ్వజమెత్తుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

