రైతుల నుంచే ఏడు నెలల వడ్డీ వసూలు
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన రైతు ఆంజనేయులుకు రుణమాఫీ అమలైంది. రుణమాఫీకి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ గత డిసెంబర్ 9 నాటికి ఆ రైతుకు అసలు, వడ్డీ కలిపి రూ.90,879 మాఫీ అయింది.
- వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామంటున్న బ్యాంకులు
- రుణమాఫీకి కటాఫ్ తేదీ గత డిసెంబర్ 9 అమలవుతున్నది జూలై 18 నుంచి
- ప్రతి రైతుపై వేలల్లో ఆర్థిక భారం
- ఈ ఏడాది జూలై 18ని కటాఫ్ తేదీగా మార్చాలని రైతుల డిమాండ్
హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన రైతు ఆంజనేయులుకు రుణమాఫీ అమలైంది. రుణమాఫీకి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ గత డిసెంబర్ 9 నాటికి ఆ రైతుకు అసలు, వడ్డీ కలిపి రూ.90,879 మాఫీ అయింది. రుణమాఫీ క్లియర్ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన ఆ రైతుకు అధికారులు ఝలక్ ఇచ్చారు. గత డిసెంబర్ 9 నుంచి ఈ నెల 22 వరకు అదనంగా రూ.9 వేల వడ్డీ అయిందని, ఆ మొత్తం చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని అధికారులు కొర్రీ పెట్టారు. ప్రభుత్వం రుణమాఫీ చేయడం ఆలస్యం చేస్తే, తామెందుకు వడ్డీ చెల్లిస్తామని ఆ రైతు ఎంత వాదించినా ప్రయోజనం లేకుండాపోయింది.
చివరికి రూ.9 వేలు చెల్లించి రుణమాఫీ పూర్తి చేయించుకున్నారు. ఇది ఒక్క ఆంజనేయులు పరిస్థితి మాత్రమే కాదు.. రుణమాఫీ పొందుతున్న మెజార్టీ రైతుల పరిస్థితి ఇదే. తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడు నెలలు ఆలస్యంగా జూలైలో ఆ ప్రక్రియను ప్రారంభించింది.
2023 డిసెంబర్ 9 వరకు ఉన్న రుణాలకు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తామంటూ ప్రభుత్వం అదే రోజును కటాఫ్ తేదీ ప్రకటించింది. దీంతో ఈ ఏడు నెలల వడ్డీని రైతులు చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామంటూ బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. చేసేదేమీ లేక రైతులు ఆర్థికంగా భారమైనప్పటికీ ఏడు నెలల వడ్డీని చెల్లిస్తున్నారు. ఏడు నెలల వడ్డీ కింద ప్రతి రైతుపై వేలల్లో ఆర్థిక భారం పడుతున్నది. రూ.లక్ష లోపు రుణం ఉన్న ప్రతి రైతు కనీసం రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకు వడ్డీ కింద చెల్లించాల్సి వస్తున్నట్టు తెలిసింది.
తొలి విడతలో 11.50 లక్షల మంది రైతులకు రూ.లక్షలోపు రుణం మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెప్తుండగా, వారందరూ కలిసి బ్యాంకులకు రూ.కోట్లలోనే వడ్డీ చెల్లించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి కొత్త డిమాండ్ వినిపిస్తున్నది. ప్రభుత్వం రుణమాఫీని ఆలస్యం చేయడం వల్లే తమకు ఈ ఇబ్బంది ఏర్పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ కటాఫ్ తేదీ మార్చాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

