సంజయ్.. ఏ భాషల మాట్లాడినవ్?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్ మీడియాలో బండి సంజయ్ పోస్ట్ పెట్టారు
మోదీ ఫోన్ చేశాడని బండి పోస్ట్
సెటైర్లతో విరుచుకుపడ్డ నెటిజన్లు
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్ మీడియాలో బండి సంజయ్ పోస్ట్ పెట్టారు. ప్రధానితో అనేక విషయాలు మాట్లాడినట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు.
‘బండికి హిందీ రాదు.. మోదీకి తెలుగు, ఇంగ్లిష్ రాదు.. ఎట్లా మాట్లాడుకున్నరు? కొంచెం ఆ ఆడియో ఉంటే పెట్టన్నా’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. ‘హిందీలో మాట్లాడినవా? అగో అదెట్ల సంజూ బ్రో’ అని ఒకరు, ‘ఇంత సంభాషణ జరిగిందా? ఏం క్రియేటివిటీ.. మీ క్రియేటివిటీ తగలెయ్య’ అని మరో నెటిజన్ పంచ్ ఇచ్చారు. సభలు, యాత్రలు సక్సెస్ అయితే సరిపోదు. కరీంనగర్‌ను అభివృద్ధి చేయా లి’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘మోదీ కొన్నేండ్లుగా ప్రధానిగా ఉన్నా రు. ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని మీరు చెప్తున్నా రు. మరి బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా అయితది? కేసీఆర్ వల్ల ప్రజలకు మంచి జరగడం లేదని మీరు అనుకుంటే.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అన్నీ మీరే చేయండి.. కేసీఆర్ ప్రజలకు అన్యాయం చేయడు. ఎన్నో లక్షల గొంతుక. తెలంగాణ బిడ్డలకు ఆత్మగౌరవం దక్కిందంటే వంద శాతం కేసీఆర్ కారణం’ అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bandi Sanjay
- Claim
- dial
- Netizens
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

