హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్టు కళాశాల డీన్ ప్రవీణ తెలిపారు. జూలై 1 నుంచి 25వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.