హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 ( నమస్తే తెలంగాణ ) : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు కోవే తెలంగాణ చాప్టర్ సభ్యులు తెలిపారు. 18 వ్యాపారాలపై అవగాహన కల్పించనున్నట్టు వెల్లడించారు.
కమ్మరి, సోనార్, ధోబీ, కుమ్మరి, టైలర్, బార్బర్, బోట్ మేకర్, టూల్ కిట్ మేక ర్, శిల్పి, ఫిషింగ్ నెట్ మేకర్, డాల్, టాయ్ మేకర్, షూస్మిత్, మేసన్స్ తదితర వ్యాపారాల్లో ఎలా వృద్ధి సాధించాలి? పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలను వివరిస్తారని చెప్పారు. వివరాలకు 040351 62064ను సంప్రదించాలని కోరారు.