Best Police Awards | ఉత్తమ పోలీసులకు రేపు అవార్డుల ప్రదానం
Best Police Awards | విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు అవార్డులు, సేవా పతకాలను బుధవారం ప్రదానం చేయనున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ ఈ పతకాలను అందించనున్నారు.
Best Police Awards | విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు అవార్డులు, సేవా పతకాలను బుధవారం ప్రదానం చేయనున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ ఈ పతకాలను అందించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం కొద్ది సంవత్సరాలుగా అవార్డులను ప్రకటిస్తున్నది. 2022 సంవత్సరానికి గాను 30 మంది పోలీస్ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పతకం, 28 మందికి ఉత్కృష్ట సేవా పతకం, అసాధారణ ఆసూచన కుశలత పతకం ఏడుగురికి, ఇన్వెస్టిగేషన్లో ప్రతిభ చూపిన ఎనిమిది మందికి హోంమినిస్టర్ మెడల్స్, ట్రైనింగ్ సమయంలో ప్రతిభ చూపిన 11 మందికి హోంమంత్రి మెడల్స్, శౌర్య పతకం 11 మంది, మహోన్నత సేవ పతకానికి ఏడుగు పోలీస్ అధికారులు ఎంపికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవా పతకం-2019లో 84 మందికి, ఆంత్రిక్ సురక్ష సేవా పతకం-2019 కింద 28 మందికి పతకాలను ప్రదానం చేయనున్నారు. ఈ పతకాలను అందుకోనున్న వారిలో డీజీపీతో పాటు అడిషనల్ డీజీలు, ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, ఒక ఎస్పీలు, ఐదుగురు అడిషనల్ ఎస్పీలు, 22 మంది డీఎస్పీలు ఉన్నారు. వీరితో పాటు 39 మంది ఇన్స్పెక్టర్లు, 57 మంది ఎస్ఐలు, 31 మంది ఏఎస్ఐలు, 22 మంది హెడ్ కానిస్టేబుల్స్, 96 మంది కానిస్టేబుల్స్ ఉన్నారని అధికారులు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

