Dharmapuri Sanjay | నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడికి యత్నం..!
Dharmapuri Sanjay | నిజామాబాద్ క్రైం : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Dharmapuri Sanjay | నిజామాబాద్ క్రైం : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం స్కార్పియో వాహనంలో నగరంలోని బస్వాగార్డెన్ రోడ్డులోని మాజీ మేయర్ సంజయ్ ఇంటికి ఇద్దరు యువకులు వచ్చారు. వారిని అక్కడే ఉన్న పనివారు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు యువకులు కారుతో సంజయ్ ఇంటి గేటును ఢీకొట్టారు. అక్కడ పని చేసే విల్సన్ గమనించి వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేశాడు.
సంబంధిత ఫోర్త్ టౌన్ సిబ్బంది అక్కడికి చేరుకొని కారులో వచ్చిన వారిని ప్రశ్నించారు. అయితే, కారులో వచ్చిన వారిలో ఒకరైన సందీప్ వర్మను పోలీసులు విచారించగా తాను మాజీ మేయర్‌తో బాగానే ఉండే వాడినని, కానీ కొన్ని రోజులుగా ఆయన తన ఫోన్ లిప్ట్ చేయడం లేదన్నారు. కారణం ఏమిటని అడుగుదామని వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు కారులో వచ్చిన వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ దాడి సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సంజయ్‌తో మాట్లాడగా ఫిర్యాదు చేసేది లేదని తెలిపినట్లు ఎస్ఐ కే సందీప్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

