Etamatam | షర్మిల ఎవరో తెలియదా? అదిరిపోయే కౌంటరిచ్చిన ఒవైసీ!
Etamatam |‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? అసలు మీలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చినవాడిని తప్పుపట్టాలి’ అంటూ సాగే ‘అనగనగా ఒకరోజు’ సినిమాలోని బ్రహ్మానందం డైలాగ్ మనం వినే ఉంటాం. నెల్లూరు పెద్దారెడ్డి సంగతి అటుంచితే, ఆ షర్మిల ఎవరో తనకు తెలియదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Etamatam | ‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? అసలు మీలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చినవాడిని తప్పుపట్టాలి’ అంటూ సాగే ‘అనగనగా ఒకరోజు’ సినిమాలోని బ్రహ్మానందం డైలాగ్ మనం వినే ఉంటాం. నెల్లూరు పెద్దారెడ్డి సంగతి అటుంచితే, ఆ షర్మిల ఎవరో తనకు తెలియదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం పట్ల స్పందించాల్సిందిగా ఓవైసీని మీడియా కోరగా, అసలు షర్మిల ఎవరు? అని ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు షర్మిల తెలియదా? అని ప్రశ్నిస్తే, వైఎస్ బిడ్డ అయితే ఏంటీ? అని ఎదురు ప్రశ్నించారు. అందరికీ తెలియడానికి ఆమె ఏమైనా తోపా అని ఓవైసీ మరింత రెచ్చిపోయారు. స్థిరత్వం లేకుండా షర్మిల మాదిరిగా పూటకో మాట మాట్లాడేవారిని ఏ రంగంలోనైనా ఏవిధంగా చులకనగా చూస్తారో అందుకు ఓవైసీ వ్యాఖ్యలే నిదర్శనం. కాగా వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలిసి కూడా షర్మిల ఆ పార్టీకి మద్దతు ప్రకటించడాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్టు ప్రకటించి వైఎస్ఆర్సీపీ కూడా చాలా లైట్ తీసుకున్న విషయం తెలిసిందే.
– వెల్జాల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

