హమాస్ సొరంగాల్లోకి కృత్రిమ వరద!
గాజాలోని హమాస్ సొరంగాల్లో కృత్రిమ వరదల్ని సృష్టించేందుకు ఇజ్రాయెల్ సైనిక బలగాలు సిద్ధమవుతున్నాయి.
- హమాస్ దళాల్ని బయటకు రప్పించేందుకు ఇజ్రాయెల్ వ్యూహం
జెరూసలేం, డిసెంబర్ 5: గాజాలోని హమాస్ సొరంగాల్లో కృత్రిమ వరదల్ని సృష్టించేందుకు ఇజ్రాయెల్ సైనిక బలగాలు సిద్ధమవుతున్నాయి. సొరంగాల్లో నక్కిన హమాస్ దళాల్ని బయటకు రప్పించేందుకు ఇజ్రాయెల్ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వార్తా కథనం వెల్లడించింది. ఈ కథనం ప్రకారం, వ్యూహం అమలుపై నవంబర్‌లో ఇజ్రాయెల్ అధికారికంగా అమెరికాతో సమాచారం పంచుకుందట. అల్ షాతీ శరణార్థి శిబిరానికి ఉత్తరాన ఐదు భారీ మోటార్ పంపుల్ని ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధం చేసిందని తెలిసింది. గాజాలోని పెద్ద పెద్ద సొరంగాలు ఇజ్రాయెల్ సైన్యానికి కొరకరాని కొయ్యగా మారాయి. అందులో బందీలతో సహా దాక్కున్న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై బాంబు దాడులు, మిలటరీ ఆపరేషన్స్, రాకెట్ దాడులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ సొరంగాలన్నింటినీ నీటితో నింపేయాలనే పథకాన్ని ఇజ్రాయెల్ ఎంచుకుంది. దీనికి సంబంధించి పనులు మొదలయ్యాయని, ఇది అమలుజేస్తే గాజాలో నీటి సరఫరా అంతా దెబ్బతింటుందని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

