ఐజేయూ నేతల వాగ్వాదం
ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభలో యూనియన్‌కు చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం ప్రారంభ సభ, మధ్యాహ్నం రాష్ట్ర డెలిగేట్ల సమావేశం నిర్వహించారు. ఇందులో యూనియన్ కార్యకలాపాల నివేదికను కార్యదర్శి రాష్ట్ర నాయకులకు చదివి వినిపించారు.
- టీయూడబ్ల్యూజే మహాసభలో ఘటన
- అమర్, శ్రీనివాస్‌రెడ్డి మధ్య మాటామాటా
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభలో యూనియన్‌కు చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం ప్రారంభ సభ, మధ్యాహ్నం రాష్ట్ర డెలిగేట్ల సమావేశం నిర్వహించారు. ఇందులో యూనియన్ కార్యకలాపాల నివేదికను కార్యదర్శి రాష్ట్ర నాయకులకు చదివి వినిపించారు.
ఈ క్రమంలో పలువురు వక్తలు మాట్లాడిన తర్వాత సమావేశం ముగిసినట్టు ప్రకటించగా ఐజేయూ మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా మాజీ సలహాదారు దేవులపల్లి అమర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతానని అధ్యక్షుడిని ముందుగానే అనుమతి అడిగానని, అయినా ఉద్దేశపూర్వకంగా సమావేశాన్ని ముగించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి కారణమేమిటో చెప్పాలని అమర్ పట్టుబట్టగా తనకు దురుద్దేశాలను ఆపాదించడం మంచిది కాదని, ఎవరిని ఎప్పుడు మాట్లాడించాలన్న అంశం అధ్యక్ష స్థానంలో ఉన్నవారిది మాత్రమేనని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి బదులిచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరూ కొంతసేపు వాదనకు దిగగా నాయకులు జోక్యం చేసుకొని సర్దిచెప్పినట్టు సమాచారం.
ఐజేయూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా అమర్ నియమితులయ్యారు. ఆ సమయంలో ఐజేయూ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత ఐజేయూ అధ్యక్షుడు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమితులు కావడంతో అదే సూత్రాన్ని వర్తింపజేయాలని అమర్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇలానే మంగళవారం జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ కొత్త కమిటీ ఎన్నిక నిర్ణయంపైనా ఓ వర్గం కినుక వహించినట్టు ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

