టీఎన్జీవోకు అనుబంధంగా అర్చక ఉద్యోగ జేఏసీ

సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు వెల్లడి
అమీర్‌పేట్, జూలై 29: తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఇకనుంచి టీఎన్జీవోకు అనుబంధంగా పనిచేస్తుందని సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. గురువారం సనత్‌నగర్ హనుమాన్ దేవస్థానం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దేవాదాయశాఖ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా టీఎన్జీవోలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. అర్చక, ఉద్యోగుల వేతనాల విషయంలో కటాఫ్ తేదీని తొలగించి, జీవో 577 ప్రకారం 2017 వరకు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులందరికీ జీఐఏ ద్వారా వేతనాలను చెల్లించేలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో జేఏసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కొండూరి కృష్ణమాచారి, ముఖ్య కార్యదర్శి బద్రీనాథాచార్యులు, ప్రధాన కార్యదర్శి రిపుంజయ శర్మ, ఉపాధ్యక్షుడు రాజేశ్వరశర్మ, ప్రతినిధులు కాటం శ్రీనివాస్‌గౌడ్, ప్రకాశ్, కిశోర్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

