Aragen Life Sciences | హైదరాబాద్‌లో ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులు..!
Aragen Life Sciences | ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ.2వేలకోట్ల కొత్త పెట్టుబడులకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
Aragen Life Sciences | ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ.2వేలకోట్ల కొత్త పెట్టుబడులకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కంపెనీ 1,500 మందికి కొత్త ఉద్యోగాలను అందించేలా ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్‌గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం కానున్నది.
దావోస్‌లో లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో మణి కంటిపూడి, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫార్మారంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించటంతో పాటు భవిష్యత్‌కు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం అన్నారు.
రాబోయే ఐదేళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించడం సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో మణి కంటిపూడి అన్నారు. హైదరాబాద్‌లో రూ.2వేలకోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త ఔషధ ఆవిష్కరణలు, పరిశోధన సంస్థల కేంద్రంగా హైదరాబాద్ జాతీయ స్థాయిలో తనకున్న హోదాను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతోందన్నారు. తమ కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్, డివైజ్‌లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ సేవలందిస్తోంది. కొత్త ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజెన్ కంపెనీకి 20 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలకు కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

