950 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు నేడు నియామక పత్రాలు
వైద్యారోగ్య శాఖలో 950 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్& ఎఫ్డబ్ల్యూ) పరిధిలో 734 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి.
- స్వయంగా అందజేయనున్న మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో 950 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్& ఎఫ్డబ్ల్యూ) పరిధిలో 734 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం కౌన్సెలింగ్ పూర్తవడంతో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు నియామక పత్రాలను అందజేయనున్నారు.
రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కేవలం 6 నెలల్లోనే ఈ నియామకాలను పూర్తిచేయడం గమనార్హం. డీపీహెచ్ & హెచ్‌డబ్ల్యూ, టీవీవీపీ, ఐపీఎం పరిధిలో 969 పోస్టుల భర్తీకి బోర్డు ఈ ఏడాది జూన్ 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డీపీహెచ్ అండ్ హెచ్‌డబ్ల్యూ పరిధిలో 751, టీవీవీపీ పరిధిలో 211, ఐపీఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్ పోస్టులైన వీటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,803 దరఖాస్తులు వచ్చాయి.
అంటే ఒక్కో పోస్టుకు దాదాపు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరిగింది. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి గత నెల 9వ తేదీన ప్రాథమిక మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. అనంతరం అభ్యంతరాలను పరిశీలించి గత నెల 20న రెండో మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను ఎంపికచేసి గత నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. చివరగా 950 పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేసి ఈ నెల 19న ఫలితాలను విడుదల చేశారు. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా సాగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

