హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రజల ప్రాణ రక్షణకు పాటుపడిన బాలలకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్(ఐసీసీడబ్ల్యూ) అందజేసే సాహస బాలల అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
6 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారు అక్టోబర్ 15 లోపు www.iccw. co.in వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత్ అవార్డు కింద రూ.లక్ష, ధ్రువ్ అవార్డు, మార్కండేయ అవార్డు, శ్రావణ్, ప్రహ్లాద్, ఏకలవ్య, అభిమన్యు అవార్డుల కింద రూ.75 వేలు, జనరల్ అవార్డుల కింద రూ.40వేలు బహుమతిగా అందజేస్తారని తెలిపారు.