హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ): ఎస్సీ ఉపకులాల సమస్యలు పరిషరించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం నేతలతో సీఎం రేవంత్‌రెడ్డిని శుక్రవారం ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఆర్డీవో నుంచి కాకుండా తహసీల్దార్ నుంచే కుల సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని, ఇతర సమస్యలు పరిషరించాలని కోరారు. ఆయా అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని వెంకటేశం వెల్లడించారు.