రాష్ట్రంలో మరో కొత్త మండలం.. నోటిఫికేషన్ జారీ
Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్‌ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 14 గ్రామాలతో పోతంగల్
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్‌ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 14 గ్రామాలతో పోతంగల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అభ్యంతరాలు, వినతులను 15 రోజుల్లోపు నిజామాబాద్ కలెక్టర్‌కు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటి ఏర్పాటుకు గతంలోనే ప్రాథమిక నో టిఫికేషన్ ఇచ్చింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 3 మండలాలు ఏర్పడగా, సిద్దిపేట, మహబూబాబాద్, జగిత్యాలలో రెండు చొప్పున ఏర్పాటు చేశారు.
కొత్త మండలాలు ఇవే..
నిజామాబాద్ – ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా(తాజాగా పోతంగల్)
సిద్దిపేట – అక్బర్ పేట్-భూంపల్లి, కుకునూరుపల్లి
మహబూబాబాద్ – సీరోలు, ఇనుగుర్తి
జగిత్యాల – ఎండపల్లి, భీమారం
సంగారెడ్డి – నిజాంపేట్
నల్లగొండ – గట్టుప్పల్
కామారెడ్డి – డోంగ్లి
మహబూబ్‌నగర్ – కౌకుంట్ల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

