Konda Surekha | మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఎస్సై కుర్చీలో కూర్చొని పోలీసులకు వార్నింగ్
Konda Surekha | అధికారం ఉందన్న అహంతో నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మరి పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు.
Konda Surekha | అధికారం ఉందన్న అహంతో నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మరి పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో ఎస్సైని నిలబెట్టి ఆ కుర్చీలో ఆమె కూర్చోవడంతో మరింత వివాదాస్పదంగా మారింది.
అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఆదివారం వివాదం నెలకొంది. దసరా పండుగను పురస్కరించుకుని ధర్మారంలో కొండా సురేఖ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. దీంతో కోపోద్రేక్తులైన కొండా సురేఖ అనుచరులు.. రేవూరి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై రేవూరీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొండా సురేఖ వర్గానికి చెందిన ముగ్గుర్ని గీసుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆ ముగ్గుర్ని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయులు ధర్నా చేశారు. చివరకు సమస్యను పరిష్కరిస్తామని సీఐ మహేందర్ హామీ ఇవ్వడంతో కొండా అనుచరులు ధర్నాను విరమించుకున్నారు.
మంత్రి కొండ సురేఖ రాకతో గీసుగొండ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత
సీఐ కుర్చీలో కూర్చున్న మంత్రి కొండా సురేఖ
పోలీస్ స్టేషన్‌కి భారీగా చేరుకున్న కొండ సురేఖ వర్గీయులు.. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని ఆరాతీస్తున్న మంత్రి సురేఖ.
మంత్రి కొండా సురేఖ, రేవూరి ప్రకాష్… https://t.co/YbqrY5v9kf pic.twitter.com/gxxDiI0TFa
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2024
తన వర్గీయులైన ముగ్గుర్ని గీసుకొండ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె స్వయంగా గీసుకొండ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్సై కుర్చీలో కూర్చొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. మంత్రి వచ్చారని తెలియడంతో ఆమె అనుచరులు భారీగా స్టేషన్‌కు తరలివచ్చారు. విషయం సీరియస్ కావడంతో వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా సీపీపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులపై డీఎస్పీ, సీఐ, ఎస్సైని వెంటనే రిలీవ్ చేయాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝాను ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

