ఇన్చార్జి డీజీపీగా అంజనీ కుమార్.. మొత్తం ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ
రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేస్తున్న అంజనీకుమార్
- ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా రవిగుప్తా
- సీఐడీ అదనపు డీజీగా మహేశ్ భగవత్
- రేపు మహేందర్‌రెడ్డి ఉద్యోగ విరమణ
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేస్తున్న అంజనీకుమార్ తదుపరి డీజీపీగా (పూర్తి అదనపు బాధ్యతలు) నియమిస్తూ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
1990వ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాను నియమించారు. ఆయనకే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరు సహా మొత్తం 6గురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జనగామ ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు..
1992లో జనగామ ఏఎస్పీగా నియమితులైన అంజనీకుమార్ అంచెలంచెలుగా డీజీపీ అయ్యారు. మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యూటేషన్‌పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పనిచేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి రెండు మెడళ్లు పొందారు. 2003 వరకు సీఐఎస్ఎఫ్లో పనిచేసి, అనంతరం రాష్ర్ట సర్వీసులకు వచ్చారు. 2005 నుంచి 2011 వరకు గుంటూరు, నిజామాబాద్ రేంజ్ డీఐజీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఐజీగా, గ్రేహౌండ్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2011-2012 మధ్యలో వరంగల్ ఐజీగా, 2012-2013 వరకు ఐజీ కమ్యూనికేషన్‌గా, 2018-2021 వరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా, అనంతరం ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
2026లో పదవీవిరమణ
రాష్ర్ట డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్ ముందువరుసలో ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్.. పాట్నా సెయింట్ జేవియర్ స్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్య ను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఐపీఎస్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు రెండు అవార్డులతోపాటు రాష్ర్టపతి పోలీసు మెడల్ అందుకొన్నారు. 2026 జనవరిలో పదవీవిరమణ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

