Budget | కాంట్రాక్టర్లకు మేలు చేసేలా రాష్ట్ర బడ్జెట్ : అనిల్ కూర్మాచలం
Budget | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్(Telangana budget) అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేసేలా ఉందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam) అన్నారు.
హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్(Telangana budget) అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేసేలా ఉందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..గత ప్రభుత్వంలో నాటి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో మంచి పథకాలు తీసుకొ చ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పక్కన బెట్టి కాంట్రాక్టు, కమీషన్ వచ్చే వాటికి ప్రాధాన్యతనిస్తున్నాయని విమర్శించారు.
ఆరు నెలలుగా ఎక్కడ కూడా నూతన విధానాలని రూపొందించలేదని మండిపడ్డారు. వారికి అలాంటి విజన్ ఉన్నట్టు కనపడడం లేదన్నారు. ఎంత సేపు రాజకీయ కోణంలోనే పాలన సాగుతుందని, ఇతర పార్టీల నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని దాని పై ఉన్న శ్రద్ధ రాష్త్ర అభివృద్ధి పై లేదని మండిపడ్డారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో సైతం ఒక్క రూపాయి తేలేని అసమర్ధ దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఘాటుగా విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వీరి ప్రజా వ్యతిరేక విధానాలని ఎక్కడికక్కడ ఎండ గడతారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులని ఊర్లో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

