‘టైగర్ రిజర్వ్‌లో అమ్రాబాద్ వెరీగుడ్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్ చేపట్టిన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దేశంలోని టైగర్రిజర్వ్ల 2018 తులనాత్మక రేటింగ్‌లో ఏటీఆర్ 78.79 స్కోర్‌తో గుడ్ క్యాటగిరీ ర్యాంక్ నుంచి 2022లో వెరీగుడ్ క్యాటగిరీ ర్యాంక్‌ను నమోదు చేసుకున్నది.
- తులనాత్మక రేటింగ్‌లో వెల్లడి
- గుడ్ నుంచి వెరీగుడ్కు ప్రమోషన్
- గుడ్ క్యాటగిరీ కిందే కవ్వాల్
- టైగర్రిజర్వ్ల పనితీరుపై నివేదిక
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్ చేపట్టిన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దేశంలోని టైగర్రిజర్వ్ల 2018 తులనాత్మక రేటింగ్‌లో ఏటీఆర్ 78.79 స్కోర్‌తో గుడ్ క్యాటగిరీ ర్యాంక్ నుంచి 2022లో వెరీగుడ్ క్యాటగిరీ ర్యాంక్‌ను నమోదు చేసుకున్నది. రాష్ట్రంలోని మరో టైగర్‌రిజర్వ్ ప్రాంతం కవ్వాల్ టైగర్‌రిజర్వ్ 2018లో ‘గుడ్’ ర్యాంక్‌ను నమోదు చేసుకోగా..2022లో కూడా 74.24 స్కోర్‌తో అదే ర్యాంక్‌లో కొనసాగింది. టైగర్రిజర్వ్ల నిర్వహణ ఎఫెక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఈఈ) కింద పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ టైగర్రిజర్వ్ల పనితీరును ఐదవ సైకిల్, 2022 అంచనా వేసింది. ఈ నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేశారు.
దేశంలోని 51 టైగర్రిజర్వ్లలో 12 ఎక్సలెంట్, 12 వెరీగుడ్, 27 గుడ్ క్యాటగిరీలో ర్యాంకులు పొందాయి. దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వ్‌లు ప్రణాళిక, ఇన్పుట్లు, ప్రక్రియ, ఫలితం, పరిణామాలు, వినియోగం వంటి ఆరు కీలక అంశాలలో వాటి పనితీరు ఆధారంగా ర్యాంక్‌లు ఖరారు చేశారు. అమ్రాబాద్ కోర్ ఏరియా పరంగా దేశంలో రెండవ అతిపెద్ద టైగర్‌రిజర్వ్. దేశంలోని 51 టైగర్ రిజర్వ్‌లలో మొత్తం వైశాల్యం ప్రకారం ఆరో స్థానంలో ఉన్నది. 1983లో అభయారణ్యంగా ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత, 2015లో అమ్రాబాద్ టైగర్రిజర్వ్గా ప్రకటించారు. దీని వైశాల్యం 2,611.39 చదరపు కిలోమీటర్లు.
ముందున్న సవాళ్లు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ, తదుపరి రేటింగ్లలో అద్భుతమైన(ఎక్సలెంట్) క్యాటగిరీలో ర్యాంక్ పొందాలంటే అధికారుల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఏర్పాటు చేసినట్టు రాష్ట్రంలోని అమ్రాబాద్, కవాల్ పరిధిలో స్పెషల్ టైగర్ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీపీఎఫ్)ని ఏర్పాటు చేయాలి. ఏటీఆర్‌లో ప్రస్తుతం ఉన్న 23 క్యాంపులకు అదనంగా మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. 2,611 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన టైగర్‌రిజర్వ్ కోసం కనీసం 70 నుంచి 80 బేస్ క్యాంపులు ఉండాలి. 1200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని బందీపూర్ రిజర్వ్‌లో దాదాపు 60 బేస్ క్యాంపులు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

