వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో అమెరికా డాక్టర్ల బృందం భేటీ
Minister Harish Rao | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో బెజ్జంకి హన్మంత్‌తో పాటు అమెరికా డాక్టర్ల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో బెజ్జంకి హన్మంత్‌తో పాటు అమెరికా డాక్టర్ల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చ జరిగింది. మొదటగా హన్మంత్ బెజ్జంకి డాక్టర్ల బృందాన్ని మంత్రి హరీష్ రావుకు పరిచయం చేశారు.
ఏఏపీఐ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- అమెరికాలో వైద్య పూర్వ విద్యార్ధులు, 80000 మంది భారతీయ సంతతికి చెందిన వైద్యులు ఉన్నారు. అలాగే ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తెలంగాణ మెడికల్ అలుమ్ని ఆఫ్ అమెరికా (OGKTMA) తెలంగాణ, హైదరాబాద్ నుండి సుమారు 20000 మంది వైద్యులు ఉన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ మెడికల్ సీట్ల కోసం తెలంగాణా విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళే పని లేకుండా మెడికల్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టారని తెలిపారు. అందులో భాగంగా కొత్తగా 8 మెడికల్ కాలేజీలను నిర్మించి వైద్య విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందాల్సిన అవసరం ఉందని సీఎం సూచనలు చేశారని తెలిపారు. అందులో భాగంగా గర్భిణీ స్త్రీలు, నవజాత శిశు సంక్షేమం గురించి కేసీఆర్ కిట్,అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏర్పాటైన బస్తీ దవాఖానాలకు విశేష స్పందన లభిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ భేటీలో డాక్టర్ హన్మంత్ బెజ్జంకి, డాక్టర్ సతీష్ కత్తుల, డాక్టర్ మెహెర్ మేదేవరం, డాక్టర్ రఘు లోలాభట్టు, డాక్టర్ సుజీత్ పున్నం, డాక్టర్ శ్రీని గంగసాని, డాక్టర్ హేమ కొర్లకుంట, డాక్టర్ జితేందర్ రెడ్డి కట్కూరి, డాక్టర్ రామారావు మేడవరం, డాక్టర్దామోదర్ నేరెళ్ల పాల్గొన్నారు, ఈ భేటీని సమన్వయ పరిచిన బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు డాక్టర్ హన్మంతు బెజ్జంకి, డాక్టర్ల బృందం అభినందించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
Regional Parties | 816కు సీట్లు పెరిగినా సంకీర్ణమే.. 2029 ఎన్నికలకల్లా జాతీయ పార్టీలు మరింత ఖల్లాస్!
KCR | కూటమి నీతితో ఓటమిని గెలిచి.. కేసీఆర్ బ్రహ్మాస్త్రం
Horoscope | 29-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

