హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. విద్యార్థుల సౌకర్యార్థం మరో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్ రేడియో, మొబైల్ యాప్ సర్వీసులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్ సోమవారం ప్రారంభించారు.
ఈ రెండు రకాల సేవల వల్ల వర్సిటీ సమాచారాన్ని విద్యార్థులు ఎప్పుటికప్పుడు తెలుసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని నవీన్‌మిట్టల్ చెప్పారు. వెబ్ రేడియోను www.braou.ac.in ద్వారా లాగిన్ కావచ్చని వీసీ తెలిపారు.