యూనియన్ నేత ఆగడాలు!
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఓ యూనియన్ నేత ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)కి కమిషనర్ లేకపోవడంతో షాడో కమిషనర్‌గా సదరు యూనియన్ నేత చలామణి అవుతున్నట్టు తెలుస్తున్నది. సీనియారిటీ లేకపోయినా వైద్యశాఖలో అత్యంత కీలక పోస్టులో ఉన్న ఓ ముఖ్య అధికారి సదరు యూనియన్ నేత వెనుక ఉండి ఈ తంతును నడిపిస్తున్నట్టు సమాచారం.
- వైద్యశాఖలో ఆయనకే పెద్ద పీట
- తాజాగా బీఎఫ్సీ మీటింగ్‌కు సైతం హాజరు
- తన పనులు చేసి పెట్టాలని అధికారులపై జులుం
- శాఖ కీలకాధికారి కనుసన్నల్లో ఇష్టారాజ్యం
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఓ యూనియన్ నేత ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)కి కమిషనర్ లేకపోవడంతో షాడో కమిషనర్‌గా సదరు యూనియన్ నేత చలామణి అవుతున్నట్టు తెలుస్తున్నది. సీనియారిటీ లేకపోయినా వైద్యశాఖలో అత్యంత కీలక పోస్టులో ఉన్న ఓ ముఖ్య అధికారి సదరు యూనియన్ నేత వెనుక ఉండి ఈ తంతును నడిపిస్తున్నట్టు సమాచారం.
టీవీవీపీలో ఏ ఫైల్ కదలాలన్న సదరు యూనియన్ నేతను కలవాల్సిందే..! అని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా యూనియన్ నేత ఏకంగా టీవీవీపీ కమిషనర్ పాల్గొనాల్సిన హెచ్‌వోడీల మీటింగ్‌లకు హాజరవుతున్నట్టు సమాచారం. తాజాగా తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎంఎస్ఐడీసీ)లో బీఎఫ్సీ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో సదరు యూనియన్ నేత పాల్గొని హడావుడి చేసినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా వైద్య శాఖలో కొంత మంది అధికారులకు ఫోన్లు చేసి తాను చెప్పిన పనులు చేసి పెట్టాల్సిందే అని హుకూం జారీ చేసినట్టు సమాచారం.
ఆరోపణలున్న అధికారికి అందలమా..?
యూనియన్ నేత గతంలో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో పనిచేస్తుండగా రూ.5లక్షల నిధులు దుర్వినియో గం చేసినట్టు తెలిసింది. దీంతో అప్పటి డీఎంఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నేతపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం వైద్యశాఖలో కీలక పోస్టులో ఉన్న ఓ ఉన్నతాధికారితో నిజామాబాద్‌లో పనిచేస్తుండగా ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని యూనియన్ నేత టీవీవీపీలో చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. అవినీతి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైన యూనియన్ నేతకు అనధికారికంగా టీవీవీపీ పగ్గాలు ఇవ్వడంపై సొంత శాఖ సిబ్బందే పెదవి విరుస్తున్నారు.
టీవీవీపీ కమిషనర్ పోస్టు నాలుగు నెలల క్రితం ఖాళీ కాగా.. ఆ పోస్టును భర్తీ చేయడంలో సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇదే అదునుగా వైద్యశాఖలో కీలకాధికారి తన పనులు చక్కబెట్టేందుకు షాడోను రంగంలోకి దింపి చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. ఒక్కో డిప్యూటేషన్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. టీవీవీపీ కమిషనర్ నియామకం విషయంలో తుది జాబితా సిద్ధం చేసినా.. నియామకాన్ని చేపట్టకపోవడంలో అలసత్వం వెనుక కీలకాధికారి హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికైనా టీవీవీపీకి పూర్తి స్థాయి కమిషనర్‌ను నియమించి.. వసూళ్ల దందాకు పాల్పడుతున్న యూనియన్ నేతకు చెక్ పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

