గాంధీలో 3 నుంచి అన్ని వైద్య సేవలు

2,3,4 అంతస్తుల్లో కొవిడ్ చికిత్స
మిగిలిన అన్ని అంతస్తుల్లోసాధారణ సేవలు
గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు
బన్సీలాల్‌పేట్, జూలై 27: ప్రస్తుతం కొవిడ్ నోడల్ కేంద్రంగాఉన్న సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో వచ్చేనెల 3 నుంచి అన్నిరకాల వైద్యసేవలు ప్రారంభిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు. కొవిడ్‌తోపాటు అత్యవసర సేవలు, ఓపీ, ఐపీ సేవలను అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 372 మంది కొవిడ్ బాధితులు ఉన్నారని, అందులో 156 మంది బ్లాక్‌ఫంగస్ రోగులు అని తెలిపారు. మంగళవారం 30 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పారు. దవాఖానలోని ప్రధానభవనంలో రెండు, మూడు అంతస్తులను కొవిడ్ సేవలకు, నాలుగో అంతస్తును బ్లాక్‌ఫంగస్ రోగుల సేవలకు కేటాయించామని చెప్పారు. 250 ఐసీయూ బెడ్లను కొవిడ్ రోగులకే వినియోగిస్తామని తెలిపారు. మిగతా అంతస్తుల్లో ఉన్న వార్డులను, ఐసీయూ వార్డులను సాధారణ రోగుల సేవలకు వినియోగిస్తామని వివరించారు. అత్యవసర సేవల విభాగం భవనంలో అన్నిరకాల రోగులను చేర్చుకుంటామని పేర్కొన్నారు. రెండోదశ కరోనా కేసులు పెరగడంతో ఈ ఏడాది మార్చి 21 నుంచి గాంధీ దవాఖానను కొవిడ్ నోడల్ కేంద్రంగా మార్చామని తెలిపారు. వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని నిర్ణయించాయని, అందుకోసం ఒకటి, ఐదు, ఆరు, ఏడు అంతస్తుల్లోని అన్నివార్డులను శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది సమిష్టి కృషితోనే కరోనాను సమర్థంగా ఎదుర్కోగలిగామని చెప్పారు. ఒకవేళ మూడోదశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

