దేశంలోనే అత్యుత్తమ ఐదో పోలీసు స్టేషన్‌గా ‘ఆలేరు’ పీఎస్
హైదరాబాద్ : తెలంగాణలోని ఆలేరు పోలీసు స్టేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీసు స్టేషన్ల టాప్ 75 జాబితాలో ఆలేరు పోలీస్ స్టేషన్ నిలిచింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో ఆలేరు పోలీసు స్టేషన్ 5వ స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో ఆలేరు పోలీసు స్టేషన్ అత్యుత్తమ స్టేషన్‌గా నిలిచింది.
అయితే పోలీసు స్టేషన్ల పనితీరు, మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. అదే సమయంలో పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

భువనగిరి జోన్‌లోని ఆలేరు పోలీసు స్టేషన్.. అత్యుత్తమ ఐదో పీఎస్‌గా నిలవడంపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఎక్సలెన్స్ సర్టిఫికెట్‌ను సీపీ మహేశ్ భగవత్.. స్టేషన్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలేరు పోలీసు స్టేషన్ సిబ్బందిని రాచకొండ సీపీ అభినందించారు. దేశ వ్యాప్తంగా 75 పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తే.. ఆలేరు పీఎస్ ఐదో స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు సీపీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. తెలంగాణ పోలీసులు పౌరులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నారడానికి ఇది నిదర్శనమని చెప్పారు. నేరాలను పూర్తిగా నిరోధించగలిగామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

