Alampur | 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం.. రేవంత్ రెడ్డి సన్నిహితుడి బరితెగింపు
Alampur | గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించారు. రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే 44 కాంట్రాక్ట్ పనులను ఆపించారు.
Alampur | గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించారు. రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే 44 కాంట్రాక్ట్ పనులను ఆపించారు. దీనిపై బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో సంపత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కంప్లయింట్ లెటర్‌ను పోలీసులు దాచేస్తున్నట్లు సమాచారం.
గద్వాల జిల్లా బీచుపల్లి – అలంపూర్ నేషనల్ హైవే 44పై ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులను భ్రమర ఇన్ఫ్రా కంపెనీ దక్కించుకుంది. అయితే ఈ పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ అనుచరుడు ఆకేపోగు పీటర్సన్ బెదిరించాడు. జనవరి 6వ తేదీన రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న స్థలానికి TS33E6768 నంబర్ కారులో వెళ్లిన పీటర్సన్ మారుణాయుధాలతో బెదిరించాడు. దీంతో భ్రమర ఇన్ఫ్రా కంపెనీ భయపడి రోడ్డు విస్తరణ పనులను ఆపేసింది. దీనిపై ఆ కంపెనీ అధినేత జగదీశ్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల నుంచి ఆదేశాలు రావడంతో సంపత్, ఆయన అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు కాపీలను కూడా పోలీసులు మాయం చేశారని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే జాతీయ రహదారి పనుల్లో కూడా కమీషన్లు కావాలంటూ సంపత్ ఒత్తడి చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా భారీ ఎత్తున ఇసుకను ఆక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్కో టిప్పర్ నుంచి నెలకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. పోలీసులే దగ్గరుండి ఈ ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ ఇసుక అక్రమ రవాణాకు సహకరించకపోతే సదరు పోలీసులను బదిలీ చేయిస్తున్నారని తెలుస్తోంది.

బెదిరింపుల తర్వాత కారులో వెళ్తున్న దృశ్యం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

