రేపే అగ్రిహబ్ ప్రారంభం

- ఎవుసానికి తోడుగా సాంకేతికత
- స్టార్టప్‌లతో రైతుకు చేయూత
- ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి సాంకేతిక దన్నుగా నిలిచేంందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన అగ్రిహబ్‌ను సోమవారం మంత్రి కేటీఆర్ అగ్రిహబ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సూచనలతో టీ హబ్‌ను ఆదర్శంగా తీసుకొని పలుస్టార్టప్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని అగ్రిహబ్‌కు వ్యవసాయ వర్సిటీ రూపకల్పన చేసింది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. వ్యవసాయానికి సాంకేతికతోడ్పాటు అందించేందుకు 21 స్టార్టప్‌లను గుర్తించిన ఐటీశాఖ, యూనివర్సిటీ 11 స్టార్టప్‌లకు ఆమోదం తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్‌లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికను వ్యవసాయరంగంలో ఈ స్టార్టప్‌ల సాయంతో వినియోగించనున్నారు. డ్రోన్లద్వారా ఎరువుల పిచికారి, రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, ఏఐ, డ్రోన్ల ద్వారా తెగుళ్ల గుర్తింపు, నీటిపారుదల యాజమన్యంపై పనిచేయనున్నారు. అగ్రిహబ్ నిర్మాణానికి నాబార్డ్ ఆర్థికంగా అండగా నిలిచింది. కేవలం ఏడు నెలల్లోనే అగ్రిహబ్ నిర్మాణం పూర్తయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- agri hub
- agriculture
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

