TSPSC | హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
మంగళవారం నుంచి పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పరీక్షలకు సంబంధించి మాక్లింక్ వెబ్సైట్లో ఉన్నదని, అభ్యర్థులు ముందుగా ప్రిపేర్ కావాలని సూచించారు. హాల్ టికెట్ల కోసం https://www.tspsc.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.