Ph.D. Entrance | పీహెచ్డీ ఎంట్రెన్స్‌లకు వర్సిటీల గుడ్‌బై.. ఇక యూజీసీ నెట్ స్కోర్ ద్వారానే అడ్మిషన్లు
రాష్ట్రంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్‌లకు అన్ని వర్సిటీలు గుడ్‌బై చెప్పాయి. ఇక నుంచి కేవలం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిసారు. కొద్ది రోజుల క్రితం పీహెచ్డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ప్రకటన చేసింది.
Ph.D. Entrance | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్‌లకు అన్ని వర్సిటీలు గుడ్‌బై చెప్పాయి. ఇక నుంచి కేవలం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిసారు. కొద్ది రోజుల క్రితం పీహెచ్డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ప్రకటన చేసింది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సుల్లో యూజీసీ నెట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని అన్ని వర్సిటీలకు లేఖలు రాసింది.
ఇప్పటి వరకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు పీహెచ్డీ అడ్మిషన్లకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించాయి. మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలు యూజీసీ – నెట్ ఆధారంగానే ప్రవేశాలు కల్పించాయి. జేఎన్టీయూతో పాటు ఓయూలోని సాంకేతిక కోర్సులు యూజీసీ నెట్లో లేకపోవడంతో వీటికి మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికే ఓయూలో జేఆర్ఎఫ్ అడ్మిషన్లు ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

