ఆదిలాబాద్ రూరల్, జనవరి 10: కేంద్రం కొత్తగా తెచ్చిన రవాణా చట్టానికి (హిట్ అండ్ రన్ రూల్స్) వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో అద్దె బస్సుల డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
బస్సుల సేవలను నిలిపివేసి డ్రైవర్లు ఆందోళన బాటపట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిబంధనలను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ హెచ్చరించారు.