Raghubabu | రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి కేసు.. నల్లగొండ కోర్టుకు రఘుబాబు
Raghubabu | బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్‌రావు యాక్సిడెంట్ కేసులో సినీ నటుడు రఘుబాబు ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్ కింద నల్గొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Raghubabu | బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్‌రావు యాక్సిడెంట్ కేసులో సినీ నటుడు రఘుబాబు ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్ కింద నల్గొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను నల్గొండ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కాగా, ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. నటుడు రఘుబాబు బుధవారం సాయంత్రం బీఎండబ్ల్యూ కారు (కేఏ 03 ఎంపీ 6914)లో హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్‌కు బైక్‌పై వెళ్తున్న బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(49)ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, యాక్సిడెంట్ జరిగిన సమయంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వెంటనే సొంత పూజీకత్తుపై విడుదల చేశారు. తాజాగా ఆయన్ను నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అందులో చురుకైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. కిందటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, జనార్దన్ రావు మృతి పట్ల మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

