7.5 కోట్ల మోసంపై నటుడు నరేశ్ ఫిర్యాదు
తెలంగాణ పోలీసుల స్పందనకు థ్యాంక్స్ అంటూ వీడియో

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తనను కిస్టోన్ ఇన్ఫ్రా కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సినీ నటుడు నరేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్ కిస్టోన్ ఇన్‌ఫ్రాతోపాటు మరికొన్ని కంపెనీలను నిర్వహిస్తున్నాడని, గతంలో తమ బిల్డర్ ఫీనిక్స్ సంస్థతో కలిసి పనిచేశారని తెలిపారు. తమ కుటుంబం వద్ద రూ.కోట్లలో రుణం తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని పేర్కొన్నారు. మొత్తం రూ.10 కోట్ల వరకు తమకు ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. దీనిపై శనివారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని చెప్పారు. తమ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించిన తెలంగాణ పోలీసులకు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం ఓ వీడియో విడుదలచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Actor Naresh
- complains
- fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

