రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణ భేష్
అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు రాష్ట్ర అటవీశాఖ చర్యలను ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసించారు.
- ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసలు
- వారి మాటలు స్ఫూర్తినిస్తాయి: మంత్రి సురేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు రాష్ట్ర అటవీశాఖ చర్యలను ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసించారు. ఈ మేరకు ఎరిక్ సోల్హెమ్ ఆదివారం ఎక్స్‌లో తన అభిప్రాయన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. అటవీ సిబ్బందికి అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదురోవటం, మంటలను ఆర్పడం అత్యంత కష్టతరమైనదే కాకుండా సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నారు.
అడవుల్లో విస్తరిస్తున్న మంటలను ఆర్పుతున్న సిబ్బందిని హరిత సైనికులు (గ్రీన్ సోల్జర్స్) గా ఎరిక్ సోల్హెమ్ అభివర్ణించారు. వీరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నదునే అడవులు, వన్యప్రాణులకు రక్షణ లభిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఎరిక్ అభినందనలు తెలిపారు. కాగా, ఎరిక్ సోల్హెమ్ రాష్ట్ర అటవీశాఖపై, అటవీ సిబ్బంది పనితీరును ప్రశంసించినందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేశఖ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అటవీ శాఖ మరింత ఉత్తేజంతో పనిచేసేందుకు వారి మాటలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

