ప్రేమ పేరుతో యువతిపై దాడి చేసిన నిందితుడు అరెస్ట్ : ఎస్పీ రెమా రాజేశ్వరి
నల్లగొండ : ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురి చేస్తూ మంగళవారం కత్తితో దాడి చేసిన నిందితున్ని నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నల్లగొండ పట్టణంలోని అబ్బసియా కాలనీకి చెందిన మీసాల రోహిత్ కుమార్ గత కొన్ని నెలలుగా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. సదరు యువతి ఒప్పుకోక పోవడంతో నిన్న మధ్యాహ్నం నల్లగొండ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీసు పార్క్ వద్ద కు రోహిత్ తన స్నేహితుడైన తాయి కుమార్ ద్వారా బాధితురాలుకు ఫోన్ చేయించాడు.
బాధితురాలు తన స్నేహితురాలుతో కలిసి పార్క్ వద్ద వెళ్లింది. అక్కడ కొద్ది సేపు అందరూ కలిసి మాట్లాడిన తరువాత, నిందితుడు పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పి బాదితు రాలిని పక్కకు తీసుకెళ్లాడు.
ముందస్తు ప్లాన్ ప్రకారం కత్తితో వచ్చిన నిందితుడు రోహిత్ బాధితురాలిని విచక్షణ రహితంగా కడుపు, చేతులు, కాళ్లు, మొహం, పైన పొడిచి గాయపరిచి అక్కడినుండి పారిపోయాడన్నారు.
వెంటనే రంగంలోకి దిగిన నల్గొండ వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్లగొండ డీఎస్పీ నరసింహరెడ్డి, సీఐ గోపి, ఎస్ఐ వెంకట రెడ్డి, సిబ్బంది షకీల్, శ్రీకాంత్ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

