Akhila suicide case | అఖిల ఆత్మహత్య కేసులో నిందితుడు సాయిగౌడ్ అరెస్ట్
Akhila suicide case | ప్రేమ పేరుతో మోసపోయి ఓ యువతి మూడు రోజుల క్రితం జీడిమెట్లలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితు సాయి గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : ప్రేమ పేరుతో మోసపోయి ఓ యువతి మూడు రోజుల క్రితం జీడిమెట్లలో(Jeedimetla) ఆత్మహత్యకు(Suicide) పాల్పడిన ఘటనలో నిందితు సాయి గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షాపూర్‌నగర్ ఎన్‌ఎల్‌బీనగర్‌కు చెందిన బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల (22) ప్రైవేటు ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన వరుగంటి వెంకటేష్ కుమారుడు అఖిల్ సాయిగౌడ్(Sai Goud) గత ఎనిమిది సంవత్సరాలుగా అఖిల(Akhila) వెంట పడ్డాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరించాడు.
అతని ప్రేమను కాదనలేక అఖిల సైతం అతని ప్రేమను అంగీకరించింది. వీరిద్దరికి పెళ్లి చేద్దామని పెద్దలు సైతం నిర్ణయించారు. కానీ గత మూడు, నాలుగు నెలల నుంచిసాయిగౌడ్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీనికితోడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి చివరికి పెళ్లి చేసుకోనని మోసం చేశాడు. ఈ మోసాన్ని పెద్దల తీసుకెళ్లినా అతడిలో మార్పు రాకపోగా ఫోన్లు చేసి వేధిస్తూ నరకం చూపిస్తున్నారని బాధపడింది.
దీంతో మానసికంగా కృంగిపోయిన అఖిల 14 పేజీల లేఖ రాసి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఇదంతా నిజమని నమ్మా.. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు నింధితుడు అఖిల్ సాయి గౌడ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

