సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు
తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిపిన ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.97,880 స్వాధీనం చేసుకున్నారు.
- లెక్కల్లోచూపని రూ.97,880 నగదు స్వాధీనం
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిపిన ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.97,880 స్వాధీనం చేసుకున్నారు.
బీబీనగర్‌లో తనిఖీల్లో అకౌంటుకాని రూ. 61,430 నగదు పట్టుబడింది. కార్యాలయం ఆవరణలో అనధికారికంగా 12 మంది ప్రైవేట్ ఏజెంట్లు/డాక్యుమెంట్ రైటర్లు ఉన్న ట్టు ఏసీబీ గుర్తించింది. 93 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు సిబ్బందివద్దనే ఉండటం, ఆఫీసులో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, ప్రభుత్వ రిజిస్టర్లు నిర్వహించకపోవడం కనిపించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
జడ్చర్లలో జమ చేయని రూ.30,900 స్వాధీనం చేసుకున్నారు. 11మంది అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నట్టు గుర్తించారు. 20 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కార్యాలయం నుంచి పంపకుండా తాత్సారం చేశారని, ప్రభుత్వ రికార్డులు సక్రమంగా నిర్వహించడంలేదని తేల్చారు. సదాశివపేటలో రూ. 7,500 స్వాధీనం చేసుకోగా.. తొమ్మిది మంది అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్టు తేల్చారు. 39 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు సిబ్బంది వద్ద ఉన్నాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

