ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బీ అరుణ, కారోబార్ దాసరి సంతోష్ మ్యుటేషన్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. బేరసారాల ద్వారా రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది.
- సిద్దిపేట జిల్లాలో 15 వేల లంచంతో పట్టుబడిన కార్యదర్శి, కారోబార్
- నాగర్‌కర్నూల్ జిల్లాలో 25 వేలతో పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్
- జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీవో ఆఫీస్‌లో ఏసీబీ అధికారుల సోదాలు
అచ్చంపేట/నారాయణరావుపేట/కోరుట్ల, అక్టోబర్ 6 : వివిధ పనుల కోసం వచ్చిన బాధితుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం … సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బీ అరుణ, కారోబార్ దాసరి సంతోష్ మ్యుటేషన్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. బేరసారాల ద్వారా రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో జక్కాపూర్ పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా కార్యదర్శి, కారోబార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిద్దరిని అరెస్ట్‌చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మెడికల్ బిల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.25 వేలు తీసుకున్నారనే ఫిర్యాదుతో సీనియర్ అకౌంటెంట్ వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్టు మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఆరు నెలల మెడికల్ లీవ్, మెడికల్ బిల్లులు, అలవెన్సుల ప్రాసెస్ చేయడానికి పట్టణంలోని సబ్‌ట్రెజరీ (ఎస్టీవో) కార్యాలయంలో బిల్లులు సమర్పించాడు. రూ.3.60 లక్షల బిల్లులు మంజూరు చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ వెంకటయ్య రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడి నుంచి ఆగస్టు 8న రూ. 3 వేలు, 18న రూ.22 వేల నగదు ఫోన్‌పే ద్వారా తీసుకున్నట్టు తేలింది. నిందితుడిని బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు.
నాగర్‌కర్నూల్ డీటీవో కార్యాలయం నుంచి వెంకటయ్య ఆగస్టు 24న అచ్చంపేట ఎస్టీవో ఆఫీస్‌కు బదిలీపై వచ్చారు. ఆయన స్వస్థలమైన ఆమనగల్లు నివాసంలోనూ సోదాలు నిర్వహించినట్టు డీఎస్పీ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో కరీంనగర్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఏజెంట్ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలాన్లు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ పనితీరును పరిశీలించారు. మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేకుండా వాహనదారులకు డ్రైవింగ్ పరీక్షలు చేస్తున్నట్టు తేల్చారు. ఆర్టీవో సిబ్బంది అధికారిక సేవల సమయంలో ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి, సీఐ తిరుపతి, ప్రేమ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

