ACB Raid | రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఆర్ఐ
ACB Raid | భూత్పూర్ తహసీల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యంను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
మహబూబ్‌నగర్ : జిల్లాలో ఏసీబీ దాడులు ( ACB Raid) కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ( Bhootpur ) తహసీల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి
రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యంను( RI Balasubramaniam ) రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకోగా ఆర్ఐ రూ.4వేలను డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో అధికారులు శుక్రవారం దాడులు చేసి ఆర్ఐను పట్టుకున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆర్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1064 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

