Academic Calender | తెలంగాణలో నూతన విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల
Academic Calender | ఈ (2023-24 ఏడాది) విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతులకు అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్: ఈ (2023-24 ఏడాది) విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతులకు అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన కాపీని ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు, SCERT డైరెక్టర్‌కు, మోడల్ స్కూళ్ల డైరెక్టర్‌కు, ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్‌కు, SIET డైరెక్టర్‌కు, TRIES డైరెక్టర్‌కు, హైదరాబాద్, వరంగల్ రీజనల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అధికారులకు ఒక్కో కాపీ చొప్పున పంపింది.
తాజా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2023 జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2024 ఏప్రిల్ 23న ముగియనున్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. 2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, SSC బోర్డ్ ఎగ్జామినేషన్ లోపల రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తిచేయనున్నారు.
ఇక క్లాస్-1 నుంచి క్లాస్-9 వరకు సిలబస్‌ను 2024 ఫిబ్రవరి 29న పూర్తిచేసి, 2024 మార్చిలో జరగబోయే ఎస్ఏ-2 పరీక్ష కోసం రివిజన్, రెమెడియల్ టీచింగ్, ప్రిపరేషన్ నిర్వహించనున్నారు. అంతేగాక ఈ ఏడాది అసెంబ్లీ అనంతరం అన్ని తరగతుల్లో 5 నిమిషాలపాటు యోగా సెషన్ కోసం కేటాయించనున్నారు. 2023 జూన్ 6 నుంచి 2023 జూన్ 9 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూల్
ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-1 పరీక్షలను ఈ ఏడాది జూలై 31 కల్లా, ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 కల్లా, సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11 వరకు, ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-3 పరీక్షలను ఏడాది డిసెంబర్ 12 లోపు, ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-4 పరీక్షలను 2024 జనవరి 29 లోపు, సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-2 పరీక్షలను 2024 ఏప్రిల్ 8 నుంచి 2024 ఏప్రిల్ 18 వరకు (1 నుంచి 9 తరగతులకు), ప్రీ ఫైనల్ (10వ తరగతి) పరీక్షలను 2024 ఫిబ్రవరి 29లోపు, SSC బోర్డు పరీక్షలను 2024 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పరీక్షల షెడ్యూల్లో పేర్కొన్నారు. అకడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కింది పీడీఎఫ్ ఫైల్లో ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

