TGPSC | పోస్టులు పెంచాలంటూ టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాన్నారు. గ్రూప్-1 మెయిన్స్‌కి 1:100 పిలువాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్-2, 3తోపాటు ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఒక్కొక్కరిగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కాగా, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గత తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్‌నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు.

నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని మోతీలాల్ నాయక్ చెప్పారు. కేసీఆర్ 9 రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది కానీ.. తాను దీక్ష చేస్తే ఒక్క ఉద్యోగం కూడా పెరుగలేదన్నారు. ఇతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇన్నిరోజులు అన్నపానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశా. తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్ లెవల్స్ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, కరెంటు వచ్చినయ్. 25 నుంచి 35 ఏండ్ల వయస్సు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలే. ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యోగులపై లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదు. మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?. నా ఫోన్ లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయడం లేదు. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలి. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

