ట్రిపుల్ఆర్ భూసేకరణ అసంపూర్ణం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్)లో ఉత్తర భాగం కోసం ఇంకా దాదాపు 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. ఈ భాగం నిర్మాణానికి మొత్తం 4,571.44 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. రైతుల నుంచి ఇప్పటివరకు 3,583.02 ఎకరాలు సేకరించారు.
- ఉత్తర భాగానికే ఇంకా వెయ్యి ఎకరాలు అవసరం
- 198 ఎకరాల అటవీ భూమిని సేకరించాల్సిన పరిస్థితి
- మొత్తం ఖర్చంతా కేంద్రమే భరించాలని రాష్ట్రం వినతి
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్)లో ఉత్తర భాగం కోసం ఇంకా దాదాపు 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. ఈ భాగం నిర్మాణానికి మొత్తం 4,571.44 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. రైతుల నుంచి ఇప్పటివరకు 3,583.02 ఎకరాలు సేకరించారు. మిగిలిన 988.42 ఎకరాల సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో 197.68 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కేంద్ర చట్టాలకు అనుగుణంగా ఆ భూమికి బదులు వేరే భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని అటవీ శాఖకు బదిలీ చేయనున్నట్టు కేంద్రానికి తెలిపింది.
భూసేకరణ ఖర్చంతా కేంద్రమే భరించాలని లేఖ
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి రూ.9,164 ఖర్చవుతుందని 2021లో అంచనా వేయగా.. ప్రస్తుతం అది మరో రూ.6 వేల కోట్ల వరకు పెరిగింది. ఇందులో భూసేకరణకే దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు కానున్నది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో కుదిరిన ఒప్పందం ప్రకారం భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉన్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరవడటంతో భూసేకరణకు అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కోరుతున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయించింది.
కోర్టు కేసులపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు
రాయగిరి పరిధిలోని 4 ప్రాంతాల్లో ట్రిపుల్ఆర్ భూసేకరణపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేత కోసం ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నది. ఉత్తర భాగం నిర్మాణానికి ఇప్పటికే అలైన్మెంట్ ఖరారై భూసేకరణ కూడా చాలావరకు పూర్తయినందున సాధ్యమైనంత మేరకు రైతులను ఒప్పించి ఆందోళన విరమింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేయాలని యోచిస్తున్నారు. కోర్టు కేసులు ఉన్నందున అలైన్మెంట్ మార్పును పరిశీలించాలని అధికారులు ఇదివరకే ఎన్హెచ్ఏఐకి లేఖ రాశారు. దీనిపై కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
ప్రాజెక్టు పురోగతిపై మంత్రి సమీక్ష
ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు పురోగతిపై రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కోర్టు కేసుల పరిష్కారం, భూసేకరణ తదితర సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిశాక సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దక్షిణ భాగం రోడ్డుకు డీపీఆర్ రెడీ
187.2 కి.మీ. పొడవైన ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి కూడా సమగ్ర ప్రాజక్టు నివేదిక (డీపీఆర్)సిద్ధమైంది. దీన్ని త్వరలో కేంద్రానికి సమర్పించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై దీనిపై నిర్ణయం తీసుకునే
అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

