బోధన్ ఎమ్మెల్యేకు పితృవియోగం

- హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి
- సంతాపం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమ స్తే తెలంగాణ)/శక్కర్‌నగర్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మ హ్మద్ షకీల్ తండ్రి మహ్మద్ ఆజాం (75) హైదరాబాద్‌లో చికిత్స పొం దుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన నెల రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని యశోదా దవాఖానలో చేర్పించారు. కొన్ని రోజుల అనంతరం కోలుకున్న ఆయన మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోమారు దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆజాం ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్‌కు తండ్రిగా, విశ్రాంత ఉ పాధ్యాయుడిగా బోధన్‌తోపాటు చుట్టుపక్కల మండలాల్లో పలువురితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆజం అంత్యక్రియలను బోధన్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యే షకీల్ తండ్రి మహ్మద్ ఆజం మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్‌కుమార్ సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bodhan mla
- CM KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

