Mancheriala | వైద్యం వికటించి మహిళ మృతి.. మంచిర్యాలలో ఘటన
Mancheriala | మంచిర్యాలలోని(Mancheriala) ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి మహిళ మృతి(Woman died) చెందిన సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 29 : మంచిర్యాలలోని(Mancheriala) ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి మహిళ మృతి(Woman died) చెందిన సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్, బొట్టిగుడెంకు చెందిన జోడు మధునక్క (45) అనే మహిళకు కడుపు నొప్పి రావడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస నర్సింగ్ హోం ప్రైవేటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించి గర్భసంచి సమస్య ఉందని, తిసేయలని కుటుంబ సభ్యులకు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి గర్భ సంచిని తొలగించారు. అలాగే రక్తం తక్కువ ఉండడంతో రక్తం కూడా ఎక్కించారు. గురువారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుండెలో నొప్పి వస్తుందని, శ్వాస సరిగా అందడం లేదని మధున తెలిపిందని, గంటన్నర సమయంలో తను మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతురాలికి భర్త పోషం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు దవాఖానకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

