హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ఇగో కేసీఆర్ తాత..అంటూ ఓ చిన్నారి కేరింతలు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలింతలకు గత ప్రభుత్వం కేసీఆర్ కిట్ అందజేయగా, నాడు అందుకున్న ఓ తల్లి తన చంటిబిడ్డకు కేసీఆర్‌ను చూపిస్తూ మురిసిపోయింది. దీంతో ఆ చిన్నారి కిట్ పై ఉన్న కేసీఆర్ చిత్రాన్ని ముద్దాడుతూ తాత.. తాత అంటూ కేరింతలు కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు కామెంట్లు పెడుతూ స్పందిస్తున్నారు. ‘పసిపాపకు ఉన్న జ్ఞానం కూడా కాంగ్రెస్ లీడర్లకు లేదని.. మంచి పథకాన్ని నిలిపివేశారని’ మండిపడుతున్నారు. ‘పథకం పేరు నచ్చకపోతే మార్చుకోండి’.. కానీ సత్ఫలితాలు ఇచ్చిన స్కీమ్‌ను ఎందుకు నిలిపివేశారంటూ నిలదీస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ వీడియో 50వేల వ్యూస్ దాటింది.