హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): ఇంట్లో వాడే ధాన్యాలు, గింజలతో ఉద్యమనేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని తయారుచేసి ఓ విద్యార్థి ప్రశంసలందుకున్నాడు.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న పడకంటి అవ్యాన్రావు, పాఠశాల ఆర్ట్ ప్రాజెక్ట్ థీమ్‌కు అనుగుణంగా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించడాన్ని బీఆర్ఎస్ ముథోల్ నాయకురాలు రమాదేవి, పాఠశాల సిబ్బంది, నెటిజన్లు ప్రత్యేకంగా అభినందించారు.