Kamareddy | కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. తల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన కూతుళ్లు..
Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిపైనే కుమారుడు, కుమార్తెలు దాడి చేశారు. బాధిత వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
Kamareddy | కన్న పేగు కోసం జీవితాంతం ఆరాటపడిన ఆ తల్లికి చివరకు అనాథగా మిగిలింది. డబ్బులు ఇవ్వలేదని కడుపున పుట్టిన కూతుళ్లే తల్లిని మృతదేహాన్ని దవాఖానలో వదిలేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ (70) గత నెల 21వ తేదీన అనారోగ్యంతో ఏరియా దవాఖానలో చేరింది. కిష్టవ్వకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కూతుళ్లు ఎల్లవ్వ, పెంటవ్వలు దవాఖానలో ఉంటూ ఆమె బాగోగులు చూసుకున్నారు.
కాగా కిష్టవ్వ పేరు మీద బ్యాంకులో రూ. లక్షా 70 వేలు ఉన్నాయి. ఈ డబ్బులకు సంబంధించి కిష్టవ్వ బంధువు నామినీగా ఉన్నారు. ఆ డబ్బులు తమకు ఇవ్వాలని ఇద్దరు కూతుళ్లు తల్లితో వాగ్వాదానికి దిగేవారు. కిష్టవ్వ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కూతుళ్లు ఆమెను దవాఖానలోనే వదిలి వెళ్లిపోయారు. దీంతో కిష్టవ్వకు దవాఖాన సిబ్బంది సపర్యలు చేస్తూ వచ్చారు. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి కిష్టవ్వ మృతి చెందింది.
దవాఖాన సిబ్బంది కూతుళ్లకు సమాచారం ఇవ్వడంతో తమకు బ్యాంకులో ఉన్న డబ్బులు ఇప్పిస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక వారు మృతదేహాన్ని భద్రపరిచారు. రేపటి వరకు చూసి మృతదేహాన్ని మున్సిపల్ వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

