ఒక్క రూపాయి పెట్టిన చిచ్చు.. స్నేహితుడి ప్రాణం తీసింది!
ఒక్క రూపాయి పెట్టిన చిచ్చుకు నిండు ప్రాణం బలైంది. స్నేహితుల మధ్య సరదాగా మొదలైన వివాదం కాస్త ముదరడంతో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. వరంగల్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.
ఒక్క రూపాయి పెట్టిన చిచ్చుకు నిండు ప్రాణం బలైంది. స్నేహితుల మధ్య సరదాగా మొదలైన వివాదం కాస్త ముదరడంతో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. వరంగల్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌లోని గాంధీనగర్‌కు చెందిన ప్రేమ్ సాగర్, అరవింద్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీళ్లిద్దరూ కలిసి శుక్రవారం ఒక హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిల్లు 59 రూపాయలు అయ్యింది. దీంతో అరవింద్ రూ.60లను యూపీఐ ద్వారా చెల్లించాడు. అది చూసిన ప్రేమ్ సాగర్.. అరవింద్‌పై సెటైర్ వేశాడు. ” ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చేంత పెద్దోడివి అయ్యావురా నువ్వు” అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. సరదాగా మొదలైన ఆ గిల్లికజ్జాలు కాస్త.. మాటామాటా పెరగడంతో పెద్ద గొడవగా మారింది. ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లారు.
క్షణికావేశంలో ప్రేమ్ సాగర్‌ను అరవింద్ గట్టిగా తోసేశాడు. దీంతో పక్కనే ఉన్న బండరాయిపై పడటంతో ప్రేమ్ సాగర్ తలకు పెద్ద దెబ్బ తగిలింది. ఇది గమనించి స్థానికులు ప్రేమ్ సాగర్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ గాయం కారణంగా మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అరవింద్ పరారీలో ఉన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

