హరితహారం స్ఫూర్తితో సింబా!
లంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణ, వృక్షాల ప్రాధాన్యతను తెలియజేసేలా ‘సింబా’ సినిమాను తెరకెక్కించామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెలకు చెందిన సంపత్ నంది దర్శకుడుగా, జీలకుంటకు చెందిన దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించా రు.
- పర్యావరణ పరిరక్షణ కథాంశంతో సినిమా
- దర్శకుడు ఓదెలకు చెందిన సంపత్ నంది
- నిర్మాత జీలకుంటకు చెందిన దాసరి రాజేందర్‌రెడ్డి
- హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల
ఓదెల, జూలై 24: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణ, వృక్షాల ప్రాధాన్యతను తెలియజేసేలా ‘సింబా’ సినిమాను తెరకెక్కించామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెలకు చెందిన సంపత్ నంది దర్శకుడుగా, జీలకుంటకు చెందిన దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించా రు. కమర్షియల్ చిత్రంగా కాకుండా వృక్షాల వల్ల కలిగే లాభాలు, భవిష్యత్‌లో ఆక్సిజన్‌కు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ ప్రజలను చైతన్య పరిచేలా సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ప్రముఖ తారాగణం జగపతిబాబు, కన్నడంలో ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్న వశిష్ఠ సింహ, ఇతర సినీ నటులతో షూట్ చేశారు. మూవీకి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎంతో సహకారం అందించిందని దర్శక, నిర్మాతలు తెలియజేశారు. మూడేండ్ల క్రితమే షూటింగ్ పూర్తికాగా విడుదల ఆలస్యమైంది. బుధవారం హైదరాబాద్‌లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

