హైదరాబాద్ : బేగంపేట(Begumpet)లోని లైఫ్‌స్టైల్ భవనం((Lifestyle building))లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లైఫ్‌స్టైల్ మొదటి అంతస్థులోని దుకాణంలో మంటలు(Fire broke) చెలరేగాయి. లోరియల్ సెలూన్లో సిలిండర్ లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటన స్థలానికి చేరుకొని భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరుగలేదని ఆగ్నిమాపక సిబ్బంది తెలిపారు.